
"భద్రం భద్రం కృతం మౌనం కోకిలైర్జల దాగమే
దుర్దురా యత్ర వక్తార స్తత్ర మౌనం హి శోభనమ్"
కోకిల మధుమాసంలో తన మధురమైన కంఠాన్ని సవరించి 'కుహూ కుహూ' అంటూ కూస్తుంది.కానీ వానాకాలంలో మౌనంగా ఉంటుంది. వానకాలంలో కప్పలు అరుస్తాయి. ధుర్భరమైన ఆ కప్పల గొంతులు అరుస్తుంటే తన మధురమైన గొంతును వినిపించడం వలన ప్రయోజనం శూన్యం. దుర్మార్గులందరూ కలసి మూర్ఖంగా వాదిస్తున్నప్పుడు ఒక సజ్జనుడు మంచి మాటలు ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. విలువ కాపడుకోవాలంటే మౌనమే శరణ్యం.

1 comment:
good blog
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.
Post a Comment